VSP: కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.హెచ్.నరసింగరావు డిమాండ్ చేశారు. ఆదివారం జగదాంబ సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా జనవరి 4న విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జరిగే మహాప్రదర్శనకు కార్మిక కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.