KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలోని ఐదు మండలాల్లో రెండవ విడత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో 162 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ స్క్రీన్లో వీక్షించారు.