జగిత్యాల జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మండలాలలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించారు. సారంగాపూర్, జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, రాయికల్, మల్యాల మండలాలలోని పలు గ్రామాలలో పోలింగ్ కేంద్రాలలో కౌంటింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డివో మధుసూదన్ పలువురు అధికారులు ఉన్నారు.