జగిత్యాల జిల్లాలో రెండో విడతలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫైనల్ పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. బీర్పూర్ మండలంలో 80.25, జగిత్యాల అర్బన్ మండలంలో 81.26, జగిత్యాల రూరల్ మండలంలో 77.69, కొడిమ్యాల మండలంలో 78.43, మల్యాల మండలంలో 77.06, సారంగాపూర్ మండలంలో 77.61 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.