E.G: కొరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్ను ఎస్సై ఎస్. శ్రీనివాసు, సిబ్బంది ఆదివారం ఘనంగా సన్మానించారు. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, ప్రజాసేవ భావం అత్యంత ముఖ్యమని ఎస్. శ్రీనివాసు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెడుతూ, శాఖకు మంచి పేరు తీసుకురావాలని నూతన కానిస్టేబుల్కు ఆయన హితవు పలికారు.