NTR: విజయవాడ వాస్తవ్యులు, శ్రీ దండమూడి స్టాలిన్ బాబు – స్వర్ణ కుమారి, మనవరాలి నూతన వస్త్ర బహుకరణ వేడుక ఆదివారం కంకిపాడు కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ సందీప్ – అవంతి, కుమార్తె చిన్నారి అవికకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.