ధర్మశాల వేదికగా IND vs SA మధ్య జరిగే మూడో టీ20లో బౌలర్లకు కష్టాలు తప్పేలా లేవు. హిమాలయాలకు దగ్గరగా ఉన్న ఈ స్టేడియంలో భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. దీంతో బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడవచ్చు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ జట్టుకు కఠిన పరిస్థితులు ఎదురుకానున్నాయి. అందుకే ఈ మ్యాచ్లో టాస్ అత్యంత కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.