WGL: జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్ర పంచాయతీ పరిధి నాలుగో వార్డులో జరిగిన ఎన్నికల్లో తల్లిపై కూతురు విజయం సాధించారు. ఈ సమరంలో తల్లి సరోజనపై కూతురు సౌజన్య స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 120 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన సౌజన్య గెలుపు ఆ పార్టీకి బలమైన ఉత్సాహాన్ని ఇచ్చిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.