ATP: పామిడి బస్టాండ్ సమీపంలో రవి అనే యువకుడు కత్తి పట్టుకొని వీరంగం సృష్టించాడు. అతన్ని పట్టుకునేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులుపై రవి కత్తితో దాడికి ప్రయత్నించాడు. అనంతరం పోలీసు వాహనం అద్దాలను రెండుసార్లు ధ్వంసం చేశాడు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కత్తి పట్టుకుని వీధుల్లో తిరుగుతూ రవి కాసేపు హల్చల్ సృష్టించాడు.