MHBD: చిన్నగూడూరు మండలంలోని ఉగ్గంపల్లి గ్రామంలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. రెండో విడత ఎన్నికల్లో నియోజకవర్గంలో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.