KRNL: కర్నూలు జిల్లాలో నేర ప్రవృత్తిని అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేరాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.