AP: రాజధాని అమరావతిలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి రూ.165 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక G+5 భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం విజయవాడ-గుంటూరు మధ్య కాజ వద్ద అద్దె భవనంలో నడుస్తున్న జ్యుడీషియల్ అకాడమీకి CRDA పిచ్చుకలపాలెం వద్ద 4.83 ఎకరాల స్థలాన్ని 60 ఏళ్ల లీజుకు కేటాయించింది. అక్కడ భవనాన్ని కూడా CRDA నిర్మించనుంది. ఈ ప్రాంతం హైకోర్టుకు సుమారు 3 కి.మీ. దూరంలో ఉంది.