U-19 ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో, ఆరోన్ జార్జ్ (85), కనిష్క్ చౌహాన్ (46), ఆయుష్ మాత్రే (38) రాణించారు. సూర్యవంశీ కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు. పాక్ బౌలర్లలో సయ్యం 3, సుభాన్ 3, షఫీక్ 2 వికెట్లు పడగొట్టారు.