ప్రకాశం: మార్కాపురం ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ప్రధాన రోడ్లపై గుంపులుగా తిరుగుతూ పాదచారులు, వాహనదారులపై దాడులకు దిగుతున్నాయి. ఈ మధ్యకాలంలో పలువురు చిన్నారులు, పెద్దవారు దాడికి గురై గాయపడ్డారు. మున్సిపల్ అధికారులు వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.