AP: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. రేపు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరుగనుంది. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.