SDPT: కొమరవెల్లిలో మల్లన్న కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ మల్లన్న కళ్యాణోత్సవానికి హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పోలీస్ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.