VKB: స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులు పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. డిసెంబర్ 17వ తేదీన సర్పంచ్ ఎన్నికలు పూర్తవుతాయన్నారు. డిసెంబర్ 20వ తేదీన నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పాలకవర్గాలు పదవీ బాధ్యతల స్వీకరణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.