NLG: ఈనెల 11న మొదటి విడతలో ఎన్నికలు జరిగిన చిట్యాల మండలం చిన్నకాపర్తిలో పోలింగ్ చిట్టీలు మురికి కాలువల లభించిన విషయాన్ని కలెక్టర్ త్రిపాఠి సీరియస్గా తీసుకున్నారు. నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డితో విచారణ చేయించి, సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించారు. ఎంపీడీవో జయలక్ష్మిని, పోలింగ్ స్టేషన్లో ఎన్నికల విధులు నిర్వహించిన మరో 11మందిని ఆమె సస్పెండ్ చేశారు.