SKLM: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆరోగ్య పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సంతబొమ్మాళి మండల పీఎసీఎస్ ఛైర్మన్ కూచెట్టి కాంతారావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఉచితనేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంటిపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేశారు.