KRNL: నకిలీ APK ఫైల్స్‌తో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. Trafficchallan.apk, eChallan.apk, PMKISAN.apk వంటి లింకులను క్లిక్ చేయవద్దన్నారు. వీటిని డౌన్లోడ్ చేస్తే బ్యాంక్ వివరాలు, OTPలు చోరీ అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.