KDP: మైదుకూరు పట్టణంలో ఆదివారం ఉల్లి రైతులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగా రమణ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ నష్ట పరిహారం అందించాలి అన్ని కోరారు. సోమవారం కడప కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి రైతులందరూ రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్, సుబ్బరాయుడు, సోమశేఖర్, రామక్రిష్ణ పాల్గొన్నారు.