దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లో నిర్మిస్తున్న నాలుగంతస్తుల అహోబిలం ఆలయం కుప్పకూలింది. ఈ ఘటనలో 52ఏళ్ల భారత సంతతి వ్యక్తి, ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు విక్కీ జైరాజ్ పాండేతో సహా నలుగురు చనిపోయారు. ప్రమాద సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే విషయంపై క్లారిటీ రాలేదు.