ATP: బొమ్మనహల్ మండలం కల్లుదేవనహళ్లికి రైతు వన్నూరుస్వామి వృషభం అద్భుతం చేసింది. 98 వరి ధాన్యం బస్తాలను (ఒక్కో బస్తా 52 కేజీలు) నింపిన 8 ఎడ్ల బండ్లను ఒకదానికొకటి జత చేశారు. ముందు బండికి కట్టిన ఎద్దు ఈ బండ్లను ఒకటిన్నర కిలోమీటర్ దూరం లాగింది. ఈ రాజసాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎద్దును గ్రామంలో ఊరేగించారు.