HYD: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) 41 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ రైళ్ల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 8 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు తప్పనిసరిగా టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.