TG: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలు ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఈ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.