BDK: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు పాల్వంచ మండలంలో పోలింగ్ కొనసాగుతోంది. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని తహసీల్దార్ దార ప్రసాద్ పరిశీలించారు. పోలింగ్ సరళిని పంచాయతీ కార్యదర్శి వంశీ కృష్ణను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు. మధ్యాహ్నం 1 గంట తరువాత పోలింగ్ ముగుస్తుంది.