గద్వాల జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదివారం ఐడీఓసీ సమావేశ మందిరం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఐజ, మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది విధులను ఆయన పరిశీలించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.