మెదక్ జిల్లా శంకరంపేట్(R) పోలింగ్ కేంద్రాన్ని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలితో ఆత్మీయంగా మాట్లాడి, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికలు పగడ్బందీగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.