మెదక్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటలకు అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నిక కోసం అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. చలి ఉన్నప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రావడం ప్రారంభించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.