యంగ్ హీరో మాస్ కా దాస్ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. డిఫరెంట్ అటెంప్ట్ చేస్తూ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాడు. ఇప్పుడు లైలాగా మెప్పించడానికి అమ్మాయి వేషంలో వస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.
Vishwak sen: Vishwak Sen as a girl.. 'Laila' looks amazing!
Vishwak sen: ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తున్న విశ్వక్.. చివరగా గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో అలరించాడు. గామిలో అఘోరగా కనిపించగా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఊర మాస్ క్యారెక్టర్ చేశాడు. ఇక ఇప్పుడు మొదటి సారి లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ‘లైలా’ అనే సినిమా చేస్తున్నాడు విశ్వక్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండడం ఆసక్తికరంగా మారింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.
అబ్బాయిగాను, అమ్మాయిగాను నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో.. తాజాగా గ్రాండ్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ సందర్భంగా..లైలా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. విశ్వక్ లేడీ గెటప్‌లో అదిరిపోయాడు. విశ్వక్ సేన్ చాలా అందంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరచింది. లైలా గెటప్‌లో విశ్వక్‌ను చూస్తే ఎవ్వరైనా పడిపోవాల్సిందే.. అన్నట్టుగా ఉన్నాడు. అయితే.. ఈ ఫస్ట్ లుక్‌లో కళ్లు మాత్రమే చూపించారు. దీంతో.. కళ్లతోనే లైలా మాయ చేసేలా ఉంది. ప్రస్తుతం లైలా లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి లైలాగా మాస్ కా దాస్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.