TPT: రేణిగుంట మండలంలో భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయుసీ రేణిగుంట మండల కార్యదర్శి కార్తిక్ డిమాండ్ చేశారు. గత పది రోజులుగా అల్పపీడనం వర్షాలు కారణంగా ఉపాధి లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్దరించి కార్మికులను ఆదుకోవాలని, అనంతరం పెండింగ్‌లో ఉన్న 42వేల క్లెయిమ్‌లకు నిధులు మంజూరు చేయాలన్నారు.