»Darling Trailer Pellam Aparichithurala Priyadarshi Darling Trailer Is Curious
Darling Trailer: పెళ్లాం అపరిచితురాలా.. ఆసక్తిగా ఉన్న ప్రియదర్శి డార్లింగ్ ట్రైలర్
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా డార్లింగ్. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
Darling Trailer: Pellam Aparichithurala.. Priyadarshi Darling trailer is curious
Darling Trailer: ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా డార్లింగ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు. డార్లింగ్ ట్రైలర్ చూస్తుంటే.. ప్రియదర్శి నభా నటేష్ తో పెళ్లి తర్వాత ఆమె వాళ్ళ ఎన్ని కష్టాలు పడ్డాడు, చిన్నపట్నుంచి భార్యతో పారిస్ వెళ్దాం అనుకున్న ప్రియదర్శి కల నెరవేరుతుందా? నభా నటేష్ కి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందా అని ఆసక్తికర అంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఫుల్ కామెడీతో పాటు ఎమోషన్ అంశాలు ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా జులై 19న రిలీజ్ కానుంది. మీరు కూడా డార్లింగ్ ట్రైలర్ చూసేయండి.