Gangs Of Godhavari: ఈ ముగ్గురు హీరోల పరిస్థితేంటి?
ఈ మధ్య థియేటర్లన్నీ ఖాళీగా కనిపించాయి. ఎన్నికల నేపథ్యంలో పలు సినిమాలు వాయిదా పడడంతో.. రెండు మూడు వారాల పాటు థియేటర్లు క్లోజ్ అయ్యాయి కూడా. కానీ ఈ వారం మాత్రం ముగ్గురు హీరోలు పోటీ పడి సందడి చేస్తున్నారు.
Gangs Of Godhavari: సమ్మర్లో రావాల్సిని పెద్ద సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మే 9న రావాల్సిన కల్కి జూన్ 27వ పోస్ట్ పోన్ అయింది. అప్పటి వరకు థియేటర్ల దగ్గర సందడి ఉండదనే అనుకున్నారు. కానీ ఈ వారం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన మాస్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ ఒకే రోజు రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. అయితే.. ఈ మూడు సినిమాలకు కూడా ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మేజర్ ఆడియెన్స్ పాటిజవ్ టాక్ ఇవ్వగా.. అక్కడక్కడ కాస్త నెగెటివిటీ టాక్ వచ్చింది. కానీ ఓవరాల్‌గా విశ్వక్ ఖాతాలో హిట్ సినిమాగా పడిపోయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా 8 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఇక భజే వాయువేగంతో కార్తికేయ హిట్ కొట్టాడని అంటున్నారు. యావరేజ్ బుకింగ్స్‌తో మొదలైన ఈ సినిమాకు.. మంచి మౌత్ టాక్ పడింది. దీంతో ఈ సినిమాకు కూడా డీసెంట్ వసూళ్లు వచ్చినట్టుగా చెబుతున్నారు. తొలి రోజు ఒకటిన్నర నుంచి 2 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్టుగా సమాచారం. వీకెండ్లో ఈ సినిమా మరింత స్ట్రాంగ్‌గా నిలబడే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా మూవీకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా డే వన్ కోటిన్నర వరకు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే.. ఈ సినిమాల బడ్జెట్ రేంజ్, వసూళ్లను బట్టి.. ఏది హిట్, ఏది ఫట్? ముగ్గురిలో విన్నర్ ఎవరు? అనేది వీకెండ్ అయితే గానీ చెప్పలేం. ప్రస్తుతానికైతే ఈ మూడు సినిమాలు మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి.