ఉన్నట్టుండి వెంటకేష్, రానాతో కలిసి రామ్ పోతినేని కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లో అంటే ఏదో అనుకునేరు, కానీ ఈ ముగ్గురు కలిసి కనిపించింది ముంబైలో. దీంతో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
Will Ram be lost in Rana Naidu? What are you planning?
Rana Naidu: ప్రస్తుతం ఓటిటి కంటెంట్‌కు అస్సలు కొదవ లేదు. సినిమాలకు మించిన బడ్జెట్లతో భారీ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాయి ప్రముఖ ఓటిటి సంస్థలు. స్టార్ హీరోలు కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో నాగ చైతన్య ధూత సిరీస్‌తో మెప్పించాడు. అలాగే బాబాయ్ అబ్బాయ్ వెంకటేష్, రానా కలిసి రానా నాయుడు సిరీస్‌తో దుమ్ముదులిపేశారు. ఈ సిరీస్‌తో బోల్డ్ అటెంప్ట్ చేసి షాక్ ఇచ్చారు. అయినా కూడా రానా నాయుడు మంచి హిట్‌గా నిలిచింది. దీంతో సెకండ్ సీజన్‌కు రెడీ అవుతోంది నెట్ ఫ్లిక్స్. త్వరలోనే రెండో సీజన్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే.. లేటెస్ట్గా వెంకటేష్, రానాతో కలిసి ముంబైలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. వెంకీ, రానా.. రానా నాయుడు కోసం వెళ్లి ఉంటారు, కానీ రామ్ ఎందుకు వెళ్లాడనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్.
కానీ.. త్వరలోనే రామ్ కూడా ఓటిటి ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ముంబైలో కనిపించడంతో.. రానా నాయుడు 2లో రామ్ నటిస్తున్నాడా? అనే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇదే నిజమైతే.. రానా నాయుడుతో కలిసి రామ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఇందులో నిజం ఉండే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ. అయితే.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తున్న నెట్ ఫ్లిక్స్ ఈ క్రేజీ కాంబోని వర్కౌట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి ఈ ముగ్గురు మాత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది.