అనిల్ రూపొందించే సినిమాలకు వందల వేల కోట్ల బడ్డెట్టులుండవు. అవి పాన్ ఇండియా సినిమాలు కావు. కానీ, అనిల్ రాసే కథలు కూడా ఓ ప్రత్యేకమైన స్లాట్‌కి చెందినవిగా మాత్రమే తయారవుతాయి. తన కథకి కావాల్సిన హీరోని ఒప్పించగలడు, అందుకు అవసరమైన బడ్జెట్టుకు నిర్మాతలను తెచ్చుకోగలడు.
దర్శకుడు అంటే ఏ చిత్రానికైనా ఒక చుక్కానిలా అనమాట. యాక్టర్స్ ఎంత గొప్పవాళ్ళైనా సరే దర్శకుడు గనక సరైన రీతిలో వారిని మలచకపోతే మాత్రం అంతా బూడిదలో పోసిన పన్నీరే. అదే దర్శకుడు అన్ని రకాలుగా ఆరితేరిన నైపుణ్యం కలిగినవాడైదే మాత్రం యాక్టర్ల పంట పండినట్టే. నిర్మాతల జేబులు నిండినట్టే. అందుకే దర్శకులకి మొదటినుంచి అంత డిమాండ్. కేవలం దర్శకుల దమ్ముతో ఆడిన సినిమాలు కోకొల్లలున్నాయి. దర్శకుల కారణంగా డిపాజిట్లు గల్లంతైన సందర్భాలు కూడా ఏం తక్కువ కాదు.
ఇటీవలి రోజుల్లో గనక చూస్తే ఆ క్రెడిట్‌ని….అంటే తన క్రియేటివ్ జీనియస్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆనువుగా, నటీనటులు,నిర్మాతలకు అదనుగా సినిమాలు తీసి హిట్ మీద హిట్ కొడుతున్న దర్శకుల జాబితాలో తిరుగులేని స్థానం మాత్రం అనిల్ రావిపూడిదే అనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రూపొందించే సినిమాలకు వందల వేల కోట్ల బడ్డెట్టులుండవు. అవి పాన్ ఇండియా సినిమాలు కావు. కానీ, అనిల్ రాసే కథలు కూడా ఓ ప్రత్యేకమైన స్లాట్‌కి చెందినవిగా మాత్రమే తయారవుతాయి. తన కథకి కావాల్సిన హీరోని ఒప్పించగలడు, అందుకు అవసరమైన బడ్జెట్టుకు నిర్మాతలను తెచ్చుకోగలడు. అందువల్ల అనిల్ రావిపూడి సినిమాలకు విరామం ఉండదు. దర్శకుడిగా తను సాధించే విజయాలు కూడా అడ్డూఆపూ లేకుండా నిరాఘాటంగా సాగుతుంన్నాయి.
మొదట్నించీ చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అనిల్ చేస్తూ వస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీసుల్ని కొల్లగొడుతూ, తన రికార్డు వేల్యూని ప్రతీ దశలోనూ పెంచుకుంటూ వస్తున్న ప్రత్యేకతను సాధించుకుంటున్న ఏకైక దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేనేలేదు. ఇటీవలే బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో నేలకొండ భగవంత్ కేసరి అనే సినిమాని తీయడం ఏ దర్శకుడికైనా ఒక ఛాలెంజ్. ఆ చాలెంజ్‌ని సునాయాసంగా అధిగమించి, విజయఢకా మోగించి, నందమూరి అభిమానులకు ప్రీతిపాత్రుడయ్యాడు అనిల్ రావిపూడి. వెంటనే మరో కథని మొదలెట్టాడు. వెంకటేష్ హీరోగా వరుణ్ తేజ్ కాంబినేషన్లో అనిల్ చేసిన ఎఫ్ టు మేజక్ పూర్తిగా ఎవరి మనసుల్లోనుంచి మాయమవకుండానే మరో ఎంటర్టైన్మెంట్ మేజిక్ తెరలేపాడు. అదే సంక్రాంతికి వస్తున్నాం సినిమా. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వ్యవహరాం చూస్తుంటే సంక్రాంతి పండగని పూర్తిగా హస్తగతం చేసుకునేట్టు ఉంది. సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్కువగా కుటుంబాలు మొత్తం చూసే సినిమాలైతే వాటికి ఏ రకంగానూ ఢోకా ఉండదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కథ వింటున్నదాని ప్రకారం ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ ని కట్టిపడేసేటట్టుంది. ఎంటర్టైన్ మెంట్ని పండించడంలో అనిల్ చేసిన ఏ సినిమా అయినా కావచ్చు అవి ఎక్కడా తగ్గలేదు. తగ్గేదేలేదు అనేటట్టుగానే బాక్సాఫీసు హిట్లయ్యాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నం వంతు. ట్రేడ్ మొత్తం సినిమా పెద్ద హిట్ అవుతుందనే గట్టి నమ్మకంతోనే ఉంది. దర్శకుడిగా అనిల్ రావిపూడి గురి తప్పదనే గ్యారెంటీ కనబడుతోంది. అందుకే ఈ సంక్రాంతి అనిల్ రావిపూడిదేననే మాట బిగ్గరగా వినిపిస్తోంది.