ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్లకు ధీటుగా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది చెన్నై చిన్నది త్రిష. అయితే.. గతంలో త్రిష గురించి ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఓ తెలుగు హీరోతో ఎఫైర్ అనేది హాట్ టాపిక్ అయింది. తాజాగా త్రిష ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.
Trisha: చివరగా విజయ్ ‘లియో। సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది త్రిష. ప్రస్తుతం తమిళ్, మళయాళంలో కొన్ని భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అలాగే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్న త్రిష.. చివరగా 2016లో నాయకి అనే సినిమా చేసింది త్రిష. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమై కోలీవుడ్‌కే పరిమితమైంది. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో చిరుతో రొమాన్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా హాట్ టాపిక్ అవుతునే ఉన్నది త్రిష. ఆ మధ్య సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ త్రిషతో రేప్ చేసే ఛాన్స్ రాలేదని చెప్పడంతో.. అమ్మడు మండిపోయింది. ఫైనల్‌గా మన్సూర్ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పలువురితో డేటింగ్ చేశానని, రిలేషన్ పెట్టుకున్నానని స్వయంగా చెప్పుకొచ్చింది త్రిష. అయితే.. ఇవేవి ఒక్కరితో కూడా వర్కౌట్ అవలేదని చెప్పింది. ప్రస్తుతానికి త్రిష ఒంటరిగానే ఉంటోంది.
ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ.. రానాతో ఎఫైర్ పై స్పందించింది. ఒకప్పుడు త్రిష టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవిస్తున్న సమయంలో.. రానాతో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు పబ్‌లు, పార్టీల్లో కనిపించడంతో నిజమేనని అన్నారు. అంతేకాదు.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వినిపించింది. కానీ కట్ చేస్తే.. రానా, మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో.. త్రిష, రానతో తనకున్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది. రానా తాను మంచి ఫ్రెండ్స్ అని.. చెన్నైలో మా ఇళ్లు పక్క పక్కన ఉండేవి. ఇద్దరం కలిసే పెరిగాము. ఒకరింటికి ఒకరు వెళ్లే వాళ్లమని చెప్పింది. రానా కూడా గతంలో ఇదే చెప్పుకొచ్చాడు. ఏదేమైనా.. రానా, త్రిష ఇప్పటికే హాట్ టాపికే అని చెప్పాలి.