»Surgery For Rashmika Otherwise It Would Be Difficult
Rashmika: రష్మికకు సర్జరీ? లేకపోతే కష్టమయ్యేదట?
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉంది. అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. కానీ ఇదంతా సర్జరీ తర్వాతనే అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ రష్మిక సర్జరీ చేయిచుకుందా?
Surgery for Rashmika? Otherwise it would be difficult?
Rashmika: నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మక.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా మారిపోయిన రష్మిక.. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ చేస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే మరో లేడీ ఓరియేంటేడ్ సినిమా కూడా చేస్తోంది. శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమాలోను నటిస్తోంది. చివరగా యానిమల్తో సాలిడ్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్ వాంటేడ్ హీరోయిన్గా మారిపోయింది. కానీ ఓ విషయంలో మాత్రం రష్మిక చాలా అప్సెట్ అయిందట. ఈ హాట్ బ్యూటీ పెదవులపై కెరీర్ స్టార్టింగ్‌లో ట్రోలింగ్ జరిగిందట. ఆమె పెదవులు అందంగా లేవని అన్నారట.
దీంతో రష్మిక ఎవరికి తెలియకుండా తన లిప్స్‌కు సర్జరీ చేయించుకుందట. ఆ సర్జరీ తర్వాతే రష్మిక మరింత అందంగా కనిపించిందట. అంతేకాదు.. అక్కడి నుంచి వరుస ఆఫర్లతో పాటు వరుస హిట్లు కూడా అందుకుందట. అయితే.. రష్మిక ఎప్పుడు ఈ సర్జరీ చేయిచుకుందనే విషయంలో మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. అయితే.. ఒక్క రష్మిక విషయంలోనే కాదు.. చాలామంది హీరోయిన్లు కూడా లిప్స్ సర్జరీ చేయించుకున్నారనే టాక్ ఉంది. ఇప్పుడు రష్మిక పై కూడా అలాంటి రూమర్స్ వస్తున్నాయనే చెప్పాలి. కానీ.. రష్మిక మాత్రం ఓ రేంజ్లో దూసుకుపోతుందనే చెప్పాలి.