»Trisha Suchi Leaks Is Trisha Behind Those Video Leaks
Trisha: సుచీ లీక్స్.. ఆ వీడియో లీకేజీల వెనక త్రిష?
కొన్నేళ్ల క్రితం సుచీ లీక్స్ పేరుతో సెలబ్రిటీల సన్నిహిత ఫొటోలు, వీడియోలు విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్స్ ప్రైవేట్ ఫోటోస్ లీక్ అయ్యాయి. అయితే.. తాజాగా సింగర్ సుచిత్ర చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
Trisha: Suchi leaks.. Is Trisha behind those video leaks?
Trisha: ప్లేబ్యాక్ సింగర్ సుచిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. కొన్నేళ్ల క్రితం సంచలనంగా నిలిచిన సుచీ లీక్స్ గురించి ఆమె చేసిన కామెంట్స్ మరోసారి సంచలనంగా మారాయి. ప్రముఖ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆమె తన మాజీ భర్త కార్తీక్ గురించి చెబుతూ గే అని చెప్పుకొచ్చింది. అలాగే.. ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారని తెలిపింది. ఈ ఇద్దరు పెళ్లికంటే ముందే వేరే వాళ్లతో డేటింగ్లో ఉన్నారని చెప్పింది. అలాగే త్రిష పై కూడా సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
గతంలో సుచీలీక్స్ పేరులో లీక్ అయిన వీడియోల వెనుక త్రిష, ధనుష్, తన మాజీ భర్త హస్తం ఉందని వెల్లడించింది. సుచీ లీక్స్ పేరుతో వీడియో లీకేజీల వెనక చిన్మయి, త్రిష ఇద్దరిదీ కీలక పాత్ర అని చెప్పింది. అసలు.. బయట కనిపించే త్రిషకు, నిజమైన త్రిషకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడింది. సుచీ లీక్స్ అనేవి ఒక ప్రాంక్‌లా మొదలుపెట్టారు. కానీ అది ఆన్ లైన్లోకి రావడానికి వారిద్దరే కారణమని తెలిపింది. దీంతో.. సుచిత్ర చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాగే.. త్రిష మరోసారి వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ అయింది.
ఇక సినిమాల నుంచి ఫేడవుట్ అవుతుందని అనుకుంటున్న సమయంలో.. పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయింది త్రిష. ఇక్కడి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటోంది. లియో సినిమాలో నటించిన ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇలాంటి సమయంలో సింగర్ సుచిత్ర చేసిన కామెంట్స్, త్రిషను వివాదంలోకి నెట్టేసేలా ఉన్నాయి. మరి త్రిష దీనిపై స్పందిస్తుందేమో చూడాలి.