కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష మధ్య ఏదో ఉందనే న్యూస్.. కొత్తేం కాదు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నిజమేనని వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ అసలేం జరుగుతోంది.
Vijay-Trisha: 'Vijay-Trisha' photos viral.. Is the affair real?
Vijay-Trisha: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రజెంట్ ఇద్దరు కలిసిన సందర్భాలు లేవు, సినిమా అప్టేట్ లేదు.. కానీ ఒకే ఒక్క ఫోటోతో రచ్చ మొదలైంది. చెప్పాలంటే.. విజయ్, త్రిష మధ్య ఏదో ఉందనే రూమర్స్ చాలా రోజులుగా వినిపిస్తునే ఉన్నాయి. ఇప్పుడు కూడా అవే రూమర్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్గా విజయ్ తన 50వ బర్త్ డేను జరుపుకున్నాడు. ఈ సందర్భంగా త్రిష.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, వారిద్దరూ లిఫ్ట్‌లో దిగిన ఫోటోని షేర్ చేసింది. దీంతో ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ ఇదే సమయంలో కొత్త పుకార్లు పుట్టుకొచ్చాయి.
గతంలో త్రిష, విజయ్ కలిసి ఉన్న ఫోటోలను వైరల్ చేస్తూ.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు కొందరు. చాలా సార్లు వీరిద్దరూ కలిసి విదేశాలకు వెళ్లారంటూ.. ఇంకొన్ని ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన తర్వాత.. ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ నిజమేనా? అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ మధ్య విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నాడనే న్యూస్ వైరల్ అయింది. గత కొన్నేళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని.. త్వరలోనే విడిపోతారంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలు పుకార్లకే పరిమితమయ్యాయి.
ఇక ఇప్పుడు త్రిష, విజయ్ ఫోటోలు వైరల్ అవుతుండడంతో.. మళ్లీ ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. గతంలో విజయ్, త్రిష కలిసి పలు చిత్రాల్లో నటించారు. చివరగా లియో సినిమాలో నటించారు. ఈ ఇద్దరు కోలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా ఉండడంతో.. విజయ్ అప్ కమింగ్ ఫిల్మ్లోను త్రిషనే హీరోయిన్ అనే టాక్ ఉంది. మరి దీనిపై విజయ్, త్రిష స్పందిస్తారేమో చూడాలి.