»Vijays Goat The Moment For The Second Song Is Fixed
Goat: విజయ్ ‘గోట్’.. రెండో పాటకు ముహూర్తం ఫిక్స్!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాగా.. ఇప్పుడు సెకండ్ పాట విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ పాట మెలోడిగా రాబోతోంది.
Vijay's 'Goat'.. the moment for the second song is fixed!
Goat: చివరగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘లియో’ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో అప్ కమింగ్ మూవీ ‘ది గోట్’ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు విజయ్ అభిమానులు. లియో తర్వాత విజయ్ చేస్తున్న సినిమా ఒకటైతే.. రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో గోట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విజయ్ 68 వ ప్రాజక్ట్‌గా తెరకెక్కుతుంది. వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఏజిఎస్ ఎంటెర్టైనేంనెట్స్ బ్యానర్ పై గ్రాండ్‌గా గోట్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు 200 కోట్లకి పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. కానీ ఈ సాంగ్‌కి అనుకున్నంత రీచ్ రాలేదు. యువన్ శంకర్ రాజా పై ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో సెకండ్ సాంగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా గోట్ టీమ్ సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. జూన్ 22 సాయంత్రం 6 గంటలకు సెకండ్ సాంగ్ లాంఛ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే.. ఇది ఫ్యామిలీ సాంగ్‌గా అర్థమవుతోంది. ఇక సెప్టెంబర్ 5న గోట్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే.. ఇప్పటికే పొలిటికల్ పార్టీ ప్రకటించిన విజయ్.. త్వరలోనే పూర్తిగా రాజకీయాల పై దృష్టి పెట్టనున్నాడు. దీంతో గోట్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే భారీ బిజినెస్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.