యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి విలన్‌గా నటిస్తున్నాడా? అని అంటే, నిజమేనని అంటున్నారు. అది కూడా ప్రశాంత్ నీల్ సినిమాలో అనే టాక్ బయటికి రావడంతో.. ఈ సారి మ్యాన్ ఆఫ్ మాసెస్ విశ్వరూపం చూడబోతున్నామనే చెప్పాలి.
NTR: ఇప్పటికే కొంత వరకు ఎన్టీఆర్లోని విలన్ యాంగిల్ చూశాం. జై లవకుశ సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు టైగర్. అలాగే టెంపర్ సినిమాలోను కాస్త నెగెటివ్ టచ్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. విలన్‌గా ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో విలన్ రోల్ హైలెట్‌గా నిలిచింది. అయితే.. ఈ సినిమా బ్రదర్ డ్రామా కాబట్టి.. ఎన్టీఆర్లోని అసలు సిసలైన విలన్ లోపలే ఉండిపోయాడని చెప్పాలి. మరి నిజంగానే ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తే ఎలా ఉంటుంది? అసలు టైగర్‌ను అలా చూసి తట్టుకోగలరా? అందులోను ప్రశాంత్ నీల్ సినిమాలో అంటే? మామూలుగా విషయం కాదు. ప్రస్తుతం వార్ 2 సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్న ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ సినిమాలోను అలాంటి పాత్రనే చేయబోతున్నాడనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఆగష్టులో షూటింగ్ అంటున్నారు.
దీంతో.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ది నెగెటివ్ పాత్ర అనే టాక్ బయటికి వచ్చింది. కెజియఫ్, సలార్ సినిమాలు చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ హీరోల గురించి, ఆ ఎలివేషన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటిది తన డ్రీమ్ ప్రాజెక్ట్, పైగా అభిమాన హీరో, అందులోను హీరోది నెగెటివ్ క్యారెక్టర్ అంటే.. అది ఊహకు కూడా అందకుండా ఉంటుంది. అందుకే.. ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి మ్యాన్ ఆఫ్ మాసెస్‌తో ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.