సాధారణంగా ఏడాదికి 12 మాసాలే ఉంటాయి. అయితే 2026, మార్చి 30న మొదలయ్యే ప్రభవ నామ సంవత్సరంలో 13 మాసాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠానికి ముందు అధిక జ్యేష్ఠం రావడమే దీనికి కారణం. దీనిని ‘పురుషోత్తమ మాసం’ అని పిలుస్తారు. ఇది శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రం. అధిక మాసంలో పూజలు, దానధర్మాలు, జపాలు చేస్తే ఎంతో శ్రేష్ఠం’ అని పండితులు సూచిస్తున్నారు.