మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం కీలక సమీక్ష జరిగింది. కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌తో పాటు డీపీవో,జడ్పీ సీఈవో పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు,పర్యవేక్షణ, అమలు చర్యలను వివరంగా పరిశీలించిన కలెక్టర్, ప్రతి దశలో క్రమశిక్షణ, సమన్వయం, పారదర్శకతను పాటించాలని అధికారులకు సూచించారు.