SDPT: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ శుక్రవారం బెజ్జంకి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా పరిశీలించారు.స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు,పెండింగ్ కేసులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.