NRPT: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిసెంబర్ 1న మక్తల్ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.