ఖమ్మం నగరంలోని DPRC భవనంలో జిల్లా స్థాయి ఫిలాటెలీ (పోస్టల్ స్టాంపుల సేకరణ) ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభిరుచులు (హాబీలు), వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.