NZB: కంఠేశ్వర్ వివేకానంద స్కూల్లో శుక్రవారం జరిగిన సామూహిక వందేమాతరం కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో దేశభక్తి పెంపొందించే దిశగా పాఠశాల తీసుకున్న ఈ మంచి ప్రయత్నం నిజంగా అభినందనీయమన్నారు. ఒకే స్వరంతో వందేమాతరం పాడిన విద్యార్థుల ఉత్సాహం, క్రమశిక్షణ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయన్నారు.