T20 World Cup: ఆస్ట్రేలియా ఇంటికి.. ఇండియా-ఇంగ్లండ్ ఢీ
పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుకు వరల్డ్ కప్‌లో ఘోర పరాభవం ఎదురయింది. సెమీస్ చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ సెమీస్‌లో ప్రవేశించింది. సూపర్ 8 గ్రూప్-1లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆఫ్ఘన్ జట్టు సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టింది.
T20 World Cup: పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుకు వరల్డ్ కప్‌లో ఘోర పరాభవం ఎదురయింది. సెమీస్ చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ సెమీస్‌లో ప్రవేశించింది. సూపర్ 8 గ్రూప్-1లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆఫ్ఘన్ జట్టు సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టింది.
టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు అనేక సంచలనాలు నమోదయ్యాయి. తాజాగా మరో సంచలనం నమోదయింది. రషీద్‌ఖాన్ సారధ్యంలోని ఆఫ్ఘన్ జట్టు టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారిగా సెమీస్‌కు చేరుకుంది. సూపర్ 8 గ్రూప్-1లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆఫ్ఘన్ జట్టు బంగ్లాదేశ్‌పై విజయం సాధించడంతో ఆసీస్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. మెగా టోర్నీ నుంచి ఆసీస్ జట్టు నిష్క్రమించింది.
తొలిత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రెహ్మతుల్లా గుర్భాజ్ 43 పరుగులు చేయగా..మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 18 పరుగులు చేశాడు. అజ్మతుల్లా ఒమర్ జాయ్ 10 పరుగులు చేయగా…చివర్లో వచ్చిన రషీద్ ఖాన్ 19 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు పరుగులు చేయలేక చతికిల పడ్డారు. దీంతో ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్ ముందు 116 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో బంగ్లాదేశ్ విలవిలలాడింది. మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ అయింది. కేవలం 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్ఘన్ స్టార్ బౌలర్ నవీనుల్ హక్, రషీద్‌ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు వికెట్లు పారేసుకున్నారు. నవీనుల్‌హక్, రషీద్ ఖాన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ పరాజయాన్ని శాసించారు. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ లిట్టన్ దాస్ 54 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. తన జట్టును పరాజయం బారి నుంచి లిట్టన్ దాస్ కాపాడలేకపోయాడు. జట్టులో నలుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు కూడా ధాటిగా ఆడలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు పదునైన బంతులు వేయడంతో.. ఆఫ్ఘన్ బ్యాటర్లు డిఫెన్స్‌లో పడ్డారు. పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడ్డారు. బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశాడు. తస్కిన్ తాను వేసిన నాలుగు ఓవర్లలో ఒక మెయిడెన్ ఓవర్ కూడా వేశాడు. కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టాడు.మరో బంగ్లా బౌలర్ రిషద్ హొసైన్ కూడా చెలరేగి బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్ల నిప్పులు చెరిగే బంతులను ఆఫ్ఘన్ బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు. వికెట్లను కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేయగలిగారు. ఎక్కువ పరుగులు రాబట్టలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు 115 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమయింది. ఆ తక్కువ టార్గెట్‌ను కూడా బంగ్లాదేశ్ చేరుకోలేక ఓటమి పాలయింది. ఆఫ్ఘన్ సంచలన విజయంలో కీలక పాత్ర పోషించిన నవీనుల్ హక్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది
బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘన్ విజయంతో సెమీఫైనల్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జూన్ 24వ తేదీ రాత్రి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ఆస్ట్రేలియా జట్టు….. బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ మ్యాచ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆఫ్ఘనిస్థాన్ ఓడితే సెమీస్‌కు వెళ్లొచ్చని భావించింది. ఇప్పుడు ఆఫ్ఘన్ గెలుపుతో ఆసీస్ టోర్నీ నుంచి వైదొలిగింది. గ్రూప్-1లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు సెమీస్‌కు చేరుకోగా.., గ్రూప్-2లో సౌతాఫ్రికా జట్టు, ఇంగ్లండ్ జట్టు క్వాలిఫై అయ్యాయి. జూన్ 27వ తేదీన సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య సెమీఫైనల్-1 మ్యాచ్ జరగనుండగా, అదే రోజు భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ రెండు మ్యాచులు పూర్తయితే…ఫైనల్ మ్యాచ్‌లో ఎవరితో ఎవరు తలపడతారనే విషయం తెలుస్తుంది.