BDK: అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని 90 ఏళ్ల బామ్మ కోరారు. చుంచుపల్లి మండలం ప్రశాంతి నగర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో 90 ఏళ్ల బామ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గరిమెళ్ళపాడు గ్రామానికి చెందిన పాయం మంగమ్మ (90) వృద్ధాప్యంలో నడవలేని స్థితిలో ఉన్నారు. అయినా ఓటు హక్కును వాడుకోవడంలో వెనక్కి తగ్గలేదు.