W.G: భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి మూలవిరాట్ దర్శనాలను ఈనెల 17 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో బీ. ఎం. నగేశ్ ఆదివారం తెలిపారు. వచ్చే నెల 13 నుంచి జరగనున్న జాతర మహోత్సవాల నేపథ్యంలో విగ్రహానికి రంగులు వేయడం, ఆభరణాల మెరుగు దిద్దే పనుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 27న తిరిగి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభమవుతాయన్నారు.